![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 ఎన్నో ట్విస్ట్ లతో మరెన్నో టాస్క్ లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల ఎలిమినేట్ కాగా మూడవ వారం సింగర్ దామిణి ఎలిమినేట్ అయింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరేంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అయితే ఇప్పుడు దామిణి ఒక ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఓటింగ్ ప్రకారం టాప్ లో ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఉంటున్నారు. అయితే దామిణి ఎలిమినేషన్ అవ్వడానికి కారణం తను కంటెంట్ కోసం నటిస్తోందని ప్రేక్షకులకు అప్పటికే అర్థం అయింది. అయితే అప్పడు అమర్ దీప్ మరియు దామిణి చివరి రెండు స్థానాలలో ఉండగా..అందరు అమర్ దీప్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారంతా కానీ దామిణి ఎలిమిమేట్ అయింది. దామిణి హౌస్ లో ఇక్కడి ముచ్చట్లు అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్తూ గొడవలు పుట్టించేది. ఒక టాస్క్ లో ప్రిన్స్ యావర్ నోట్లో పేడ కొట్టి, జండు బామ్ పెట్టి, ముక్కులో గడ్డి దూర్చి పైశాచి ఆనందాన్ని పొందింది.
దాంతో ప్రేక్షకుల దృష్టిలో కంప్లీట్ నెగెటివ్ ఇంపాక్ట్ తెచ్చుకుంది దామిణి. ఇక ఓటింగ్ లో జస్ట్ 2 శాతం ఓటింగ్ మాత్రమే దామిణికి పడటంతో తను లిస్ట్ లో అట్టడుగునకి చేరింది. ఇక తను నామినేషన్లలో చెప్పే పాయింట్లు కూడా చాలా సిల్లీగా అనిపించాయి. అది దామిణి బయటకు రావడానికి మరింత కారణమయ్యాయి. ఈ వచ్చేప్పుడు కూడా బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ కి కొన్ని సలహాలని ఇవ్వగా అవి కాస్త ఫేక్ అని తేలింది. శివాజీ కరెక్ట్ మాట్లాడిన తనేదో తప్పు అన్నట్టు మాట్లాడిన దామిణి మాటలని నమ్మడానికి కాసింతైన అవకాశం లేకుండా పోయింది.
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మూడవ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా దామిణిని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా యాంకర్ శివతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్ పోజింగ్ చేసావని కొందరు అంటున్నారని శివ అడుగగా.. నా బట్టలు నా ఇష్టం అని దామిణి అంది. హౌస్ లో ఎవరితో సరిగ్గా లేవని ఆడియన్స్ అన్నారని శివ అడుగగా.. నేను ఎలా ఉండాలో మీరెందుకు చెప్తారు నాకు నచ్చినట్టు నేనుంటాను. మీ కోసం నన్ను నేను మార్చుకోనని దామిణి అంది. బయటకొచ్చాక రాహుల్ సిప్లిగంజ్ ని ఎందుకు కలిసావని యాంకర్ శివ అడుగగా.. వాళ్ళిద్దరి కలిసి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి కదా వాటి గురించి అడగడానికి వెళ్ళానని దామిణి అంది. వైల్డ్ కార్డ్ గా రతిక హౌస్ లోకి వెళ్లింది కదా దానిపై మీ అభిప్రాయమేంటని అడుగగా.. లోపలికి పంపించాలని అనుకున్నారు పంపించారని దామిణి అంది. ఇలా బిగ్ బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది దామిణి.
![]() |
![]() |